Wednesday, January 15, 2025

ఐదేళ్ల పాలనలో నాసిరకం ప్రసాదం పెట్టారు

- Advertisement -

ఐదేళ్ల పాలనలో నాసిరకం ప్రసాదం పెట్టారు

During the five-year rule, qualityless prasad was given

తిరుమల
టీటీడీ ప్రసాదాలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక పిర్యాదు చేశాం . ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతితో చేయడం లేదని, రుచిలో కూడా మార్పు వచ్చిందని అప్పటి ఈవో, చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లాం. నా పిర్యాదులు కనీసం పట్టించుకోలేదని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో నాసిరకం అన్న ప్రసాదం, నివేదించారు. సిఎంగా చంద్రబాబు అధికారం చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన చేపట్టారు. అనేక అంశాల్లో ప్రక్షాళన  చేస్తూ వస్తున్నారు… నేను ల్యాబ్ రిపోర్టర్ చూశాను .  ల్యాబ్ రిపోర్ట్ అనుగుణంగా అందులో వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసింది. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు నన్ను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసింది.  కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు అధికారులు. ప్రభుత్వ కేసుల వల్ల ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చిందని అన్నారు.
ఇప్పుడు శ్రీవారి కైంకర్యాలు ఎలా జరుగుతుందని, ఇప్పుడున్న ప్రధాన అర్చకులు చెప్పాల్సి ఉంది. ప్రశ్నించినందుకే నన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారు…. అయినా స్వామి వారి కైంకర్యాలు సజావుగా సాగాలని కోరుకున్ననని అన్నారు. ఆగమ శాస్త్రం అనుసారం నైవేద్య సమర్పణ జరగటం లేదు. కోవిడ్ సమయంలో దిట్టని తగ్గించారు…. చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే అపచారమే. తక్కువ దిట్టం చేయడం అపచారం. ఆర్గానిక్ ప్రసాదంను వ్యతిరేకించా. స్వామి వారికి కొన్ని వేల సంవస్థరాలుగా వస్తున్న ఆచారం ప్రకారమే అన్నప్రసాదం నివేదించాలని స్పష్టం చేశా . పాడైపోయిన అర్చక వ్యవస్థను, ఆలయ నిర్వహణను గాడిన పెట్టేందుకు నాకు ఓ అవకాశం ఇవ్వాలని కోరానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్