సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు
During the visit of CM Revanth Reddy, a prestigious arrangement was made
పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్
పెద్దపల్లి
ముఖ్యమంత్రి గ్రూప్-4తో పాటుగా వివిధ పరీక్షల ద్వారా రిక్రూట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రలను అందజేత మరియు పలు అబివృద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమాలలో భాగంగా పెద్ద కల్వలలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్నందున పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐజి, తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి రంగంపల్లి లోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్లో బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి సిపి భద్రతారమైన సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తం 2000 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఎస్పి లు-7, అదనపు ఎస్పీ లు- 3, డి.ఎస్.పి, ఏసిపి,
లు – 15, సిఐ లు-.48, ఎస్సై లు –124, మహిళా ఎస్ఐ లు –15, ఏ ఎస్ఐ హెచ్ సి లు -316. కానిస్టేబుల్ లు – 846, హెచ్ జి లు -384 మంది, క్యూ ఆర్టి,మెంబెర్స్ –70, స్పెషల్ పార్టీ లు -10 పోలీసు అధికారులు సిబ్బందితో, పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిపి తెలిపారు. పెద్దపల్లి కలెక్టరేట్ లోని హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్, శిల పలకాల ప్రారంభోత్సవాల, రుప్ టాప్, పబ్లిక్ మీటింగ్, డయాస్, పార్కింగ్ ప్రాంతాల వద్ద ఉండే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు భద్రతాపరమైన సూచనలు ఇచ్చారు. పోలీసు బందోబస్తును సెక్టార్లుగా విభజించి డి.ఎస్ పి, ఏసిపి లు ఇంచార్జీ లుగా బారి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రోప్ పార్టీలు, రోడ్ ఓపెనింగ్ పార్టీ లు, పెట్రోలింగ్ పార్టీలు, ట్రాఫిక్ డైవర్షన్, పికేటింగ్, బిడి టీమ్స్ మొదలగు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశలలో అప్రమత్తంగా ఉండి, విధులు నిర్వర్తించే సమయంలో సంయమనం పాటించాలని పక్కాగా విధులు నిర్వర్తించాలని ముఖ్యంగా పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్ సెక్టర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని సిపి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన, మంచిర్యాల డిసిపి భాస్కర్, కొమరం భీం ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాస్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సీ. రాజు, రాజన్న సిరిసిల్ల అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎసిపిలు, సీఐ లు, ఎస్ఐ లు బందోబస్త్ హాజరైన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.