- Advertisement -
దసరా, దీపావళీ స్పెషల్ ట్రైన్స్ రెడీ
Dussehra and Diwali special trains are ready
హైదరాబాద్, ఆగస్టు 31, (న్యూస్ పల్స్)
తెలుగు రాష్ట్రాల ప్రజలు దసరా, దీపావళి పండుగలను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ పండుగకు ప్రతి కుటుంబ సభ్యుడు ఇంటికి రావాల్సిందే. అంతా కలిసి పండుగ చేసుకోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. అందుకే దసరా, దీపావళి సమయాల్లో ఏ బస్సు చూసినా ఫుల్ ప్యాక్ అయి రాజధాని నగరం నుంచి జిల్లాలకు తరలుతుంటాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్‌లలో సీట్ల కోసం పాట్లు మామూలుగా ఉండవు. రైలు మార్గాలు కూడా అంతే. టికెట్లు ఎప్పుడో బుక్ అయిపోయి ఉంటాయి. జనరల్ బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్లుతుంటారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఒక మంచి కబురు తెలిపింది. రైలు ప్రయాణం చేసే తెలుగు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.దసరా, దీపావళి, ఛత్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణిలకు ఆటంకాలు తొలగించాలనే ఆలోచనతో దక్షిణ మధ్య రైల్వే 48 ప్రత్యేక ట్రైన్లను నడుపనుంది. ఎస్‌సీఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్‌సీఆర్ ప్రకారం,
– కాచిగూడ నుంచి తిరుపతి(07653) ట్రైన్ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11 వరకు సర్వీసులు అందిస్తుంది. ఈ ట్రైన్ కాచిగూడ వద్ద రాత్రి 10.30 గంటలకు బయల్దేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 10.10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆరు గురువారాలు సర్వీస్ అందిస్తుంది.
తిరుపతి నుంచి కాచిగూడ (07654) ట్రైన్ అక్టోబర్ 11 నుంచి నవంబర్ 15వ తేదీ (ప్రతి శుక్రవారం సేవలు) వరకు నడుస్తుంది. తిరుపతి స్టేషన్‌లో ఈ ట్రైన్ రాత్రి 8.05 గంటలకు డిపార్చర్ అవుతుంది. తర్వాతి రోజు రాత్రి 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
– సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్ (07517) ఈ సర్వీసు అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ (ప్రతి బుధవారం అందుబాటులో సికింద్రాబాద్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటుంది.) వరకు ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
– నాగర్‌సోల్ నుంచి సికింద్రాబాద్ (07518) సర్వీస్ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 7వ తేదీ (ప్రతి గురువారం) వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ రాత్రి 10 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు చేరుకుంటుంది.
– కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ (07122) ట్రైన్ అక్టోబర్ 7 నుంచి నవంబర్ 4వ తేదీ ( ప్రతి సోమవారం) వరకు సర్వీసులు అందిస్తుంది. సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
– సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ (07188) సర్వీస్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 5వ తేదీ (ప్రతి మంగళవారం) వరకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 8 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక ట్రైన్‌లలో ఫస్ట్ ఏసీ కమ్ 2ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాసు, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయని ఎస్‌సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
- Advertisement -