Friday, February 7, 2025

ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించాలి–సీపీ డా అనురాధ

- Advertisement -

ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించాలి–సీపీ డా అనురాధ

Duties should be performed with the aim of protecting the people--CP Dr. Anuradha

సిద్దిపేట
వార్షిక తనిఖీల్లో భాగంగా సిద్దిపేట వన్ టౌన్,  మహిళా పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని పోలీస్ సబ్సిడరీ క్యాంటీన్ లను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సందర్శించారు.
పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మరియు సీజ్ చేసిన వాహనాలను రిసెప్షన్ రికార్డ్ రైటర్ రూమ్ పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.పోలీస్ స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క  అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా  అప్పగించాలని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కు సూచించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలి.ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు  పొందాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి  సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలి. ఇసుక,జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి  ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు  మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సిడి ఫైల్స్, తనిఖీ చేశారు ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.
పోలీస్ సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని  ఏవైనా సమస్యలు ఉంటేనే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. విపిఓ, విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించిన గ్రామాలకు కేటాయించిన వార్డులకు తరచుగా సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించారు.విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని ఉదయం సాయంత్రం విసేబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. సమయం దొరికినప్పుడల్లా వాకింగ్ రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు.
పాత నేరస్తులైన కేడీలు డీసీలు సస్పెక్ట్ లను  తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు.
ఈ సందర్భంగా సిబ్బందితో పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు  రమేష్, జానకి రామ్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్లు  శ్రీధర్ గౌడ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కోర్టు లైజనింగ్ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, సీసీ నితిన్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, మరియు పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నా

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్