నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి
ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల పైన 11 రోజులపాటు భక్తులు వస్తారని ఈవో పెద్దిరాజు అంచనా వేశారు. అందులో భాగంగా నేటి నుండి 11 వరకు ఆర్జిత సేవలు నిలుపుదల చేసి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు .
జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే రేపటి నుండి మార్చి 5న సాయంత్రం వరకు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నామని అలానే మాలధారణ కలిగిన శివస్వాములకు చంద్రావతీ కల్యాణ మండపం ద్వారా ప్రత్యేక దర్శన క్యూలైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షేత్ర పరిధిలో 11 చోట్ల 38 ఎకరాలలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలు
01 న యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సాయంత్రం ధ్వజారోహణ
02 వ తేదీన భృంగివాహన సేవ 03 వ తేదీన హంసవాహనసేవ.
04 వతేదీన మయూరవాహనసేవ, 05 వతేదీన రావణవాహన సేవ
06 వతేదీన పుష్పపల్లకీ సేవ
07 వతేదీన గజవాహనసేవ
08 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నందివాహనసేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాగాలంకరణ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం
09 వతేదీన స్వామి అమ్మవారికి రథోత్సవం రాత్రి తెప్పోత్సవం
10 వ తేదీన యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
11 వ తేదీన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం పట్టువస్త్రాల సమర్పణతో బ్రహ్మోత్సవాలు ముగింపు
బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి శ్రీ స్వామి అమ్మవారి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
నేడు శ్రీ కాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ
02 వతేదీ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరుపున పట్టు వస్త్రాలు
03 వతేదీ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం
04 వతేదీ ఉదయం శ్రీ వర సిద్ధివినాయక స్వామి వార్ల దేవస్థానం కాణిపాకం,
04 వతేదీ సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టువస్త్రాల సంప్రదాయం
05 వతేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు