Thursday, March 5, 2026

ఇండోనేషియాలో భూకంపం

- Advertisement -

జకార్తా, నవంబర్ 8, (వాయిస్ టుడే  ): ఇండోనేషియాలో భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి. సౌలంకి సిటీలో భూమి ఒక్కసారిగా కంపించింది.  రిపోర్ట్ ప్రకారం..రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎంత మంది చనిపోయారు..? ఎంత మంది గాయపడ్డారు..? అన్న వివరాలు ఇంకా తెలియలేదు. ఇవాళ ఉదయం 10.23 గంటలకు బండా సముద్రంలో  ఈ ప్రకంపనలు నమోదయ్యాయని   వెల్లడించింది. అయితే ఈ భూప్రకంపనల నేపథ్యంలో  సునామీ హెచ్చరికలు మాత్రం చేయలేదు. ఇండోనేషియాలోని అంబాన్‌కి ఆగ్నేయ దిశలో 370 కిలోమీటర్ల మేర ఈ ప్రభావం కనిపించింది. 146 కిలోమీటర్ల లోతు వరకూ ప్రకంపనలు నమోదయ్యాయి. సౌలంకి పరిసర ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించింది. “భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఇక్కడి పౌరులు ధైర్యంగానే ఉన్నారు. ఇక్కడ భూకంపాలు సాధారణమైపోయాయి. పైగా సునామీ హెచ్చరికలు ఏమీ లేవు. అందుకే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికైతే ఏ ఇబ్బందీ లేదు”ఇండోనేషియాలో భూకంపాలు చాలా సాధారణం. అందుకే దీన్ని Pacific Ring of Fire గా పిలుస్తారు. జపాన్‌ భౌగోళిక పరిస్థితులు ఇండోనేషియాపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే..ఇక్కడ తరచూ భూకంపాలు నమోదవుతుంటాయి. గతేడాది నవంబర్‌లో West Java ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది. ఆ సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో భూకంప ధాటికి 602 మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లోనూ సుమత్రా తీర ప్రాంతంలో 9.1 మ్యాగ్నిట్యూడ్‌తో భూమి కంపించింది. ఆ ధాటికి 2లక్షల 20 వేల మంది మృతి చెందారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్