- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం
Earthquake in Telugu states
ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు
హైదరాబాద్/విజయవాడ
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది.
ప్రకంపనలు సృష్టించింది. ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భూకంపం వచ్చింది. కొన్ని చోట్ల నిమిషం పాటు స్పల్పంగా భూమి కంపించింది. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకన్లపాటు భూమి కంపించింది. బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఐదు సెకన్లపాటు భూమి కంపించింది. ఉదయం 7:28 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. భూకంపం దెబ్బకు కుర్చీలో కూర్చున ప్రజలు సైతం కిందపడిపోయారు. దీంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరీంనగర్ విద్యానగర్లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్లో సైతం స్వల్పంగా భూకంపం వచ్చింది. ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో ఐదు సెకండ్ ల పాటు భూమి ఊగింది. ఇంట్లో ఉన్న సామాన్లు బీరువాలు బిల్డింగులు ఊగడం భూమి ఊగినట్టుగా ఆనవాళ్లు కనిపించాయి.
- Advertisement -


