- Advertisement -
కార్యకర్తలను కలుసుకుంటూ…
ఛాయ్, సమోసలు తింటూ..
మంత్రి పొన్నం మార్నింగ్ వాక్
హుజురాబాద్
మంత్రి పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తో కలిసి ఓ హోటల్ లో చాయ్ తాగారు. జమ్మికుంట పట్టణం లోని డాల్ఫిన్ హోటల్ లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సమోసాలు తింటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే జమ్మికుంటకు వస్తానని మార్నింగ్ వాకింగ్ లో పట్టణ ప్రజలు కలుస్తానని కాంగ్రెస్ నాయకులకు తెలియజేశారు. జమ్మికుంట కు మంత్రి పొన్నం ప్రభాకర్ రావడంతో కార్యకర్తల్లో మంచి ఉత్సాహంతో మంత్రి పొన్నంకు కరచాలనం చేస్తూ ఆనందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -