- Advertisement -
కె.టిఆర్‌పై ఈడీ కేసు నమోదు
ED has registered a case against K.T.R
హైదరాబాద్
మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదు అయిన ఫార్ములా ఇ కేసు చుట్టూ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇంత వరకు ఏసీబీ మాత్రం దీనిపై ఫోకస్డ్‌గా వర్క్ చేస్తుందని అంతా అనుకున్నారు. కాని ఇందులో 55 కోట్ల రూపాయల వ్యవహారం ఉన్నందున ఈడీ కూడా దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టిఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా ఇ రేస్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై కేటీఆర్ సహా ఇతరుల పాత్ర ఉందని అనుమానిస్తున్న ఈడీ కేసు నమోదు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుంచి ఫార్ములా E ఆపరేషన్స్ (FEO)కి కోట్లు బదిలీ చేశారని తేల్చినట్టు సమాచారం. ఇలా బదిలీ చేయడానికి సరైన అనుమతులు తీసుకోలేదని అంటున్నారు. ₹55 కోట్లను అనధికారికంగా బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేటీఆర్‌ను ఎ-1గా పేర్కొంటూ ఇప్పటికే ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసింది. దీని ఆధారంగానే ఈడీ కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ పేర్కొన్నట్టు ఇతర అధికారులపై కూడా ఈడీ దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ నుంచి ఈడీ ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకోవడానికి ప్రక్రియ ప్రారంభించిందని తెలుస్తోంది. అనధికారికంగా ఈ కాపీని తీసుకున్న ఈడీ అధికారులు దీనిపై మంతనాలు చేస్తున్నారట. మొదట దీన్ని PMLA కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మరింత లోతుకు వెళ్లిన తర్వాత ఫెమా కింద కూడా కేసులు పెడతామంటున్నారట. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఇ రేస్ కోసం కేటీఆర్ ఆదేశాల మేరకు ₹55 కోట్లను అధికారులు బదిలీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా బదిలీ చేయడం చట్టవిరుద్దమని ACB FIRలో పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై అనుమాం వ్యక్తం చేసిన ఆ రేస్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జరిగిన ఈవెంట్‌లో నిధులు దుర్వినియోగం, అక్రమాలపై విచారణకు ఆదేశించింది. తీవ్ర చర్చోచర్చలు ఆధారంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 12న కేటీఆర్, అరవింద్ కుమార్‌ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ప్రభుత్వ సీఎస్ ఆదేశం మేరకు, మున్సిపల్ శాఖ ఫిర్యాదుతో ఏసీబీ విచారణ చేపట్టింది. ఈ కేసు చాలా విచిత్రమైందని అన్న కేటీఆర్ న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటామని అంటున్నారు. ఇప్పటికే కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. ప్రజాసమస్యల నుంచి ప్రజలను దృష్టిని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు న్యాయస్థానంలో నిలబడదని అంటున్నారు కేటీఆర్.
సీఎం సమాచారం లోపం
సీఎం సమాచారం లోపం ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేటీఆర్.. తనపై కేసు నిలవదని ధీమా వ్యక్తం చేశారు. తాము లీగల్‌గా ముందుకు వెళ్తామని.. లంచ్ మోషన్ పిటిషన్ వేశామని చెప్పారు. తనను ఏ కేసులో అరెస్టు చేయాలో సీఎంకు ఆర్థం కావడం లేదన్నారు.
కేటీఆఏసీబీ కేసు విషయంలో తానేం భయపడడం లేదని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి జరగలేదన్నారని గుర్తు చేశారు. ప్రొసీజర్ మాత్రమే సరిగా లేదన్నారని.. ఈ విషయంలో సీఎంను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా ముఖ్యమంత్రే అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారా? అని అనుమానాం వ్యక్తం చేశారు. తాము కూడా లీగల్‌గానే ముందుకెళతామని తేల్చిచెప్పారు.’మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలింది. హెచ్ఎండీఏ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైన డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉంది. హెచ్ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు. దానికి ఆ మేరకు స్వతంత్రత ఉంది. లంచ్ మోషన్ పిటీషన్‌పైన కోర్టు తెలుస్తుంది. ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు. అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకుపోతే వాళ్ల ఇష్టం. న్యాయపరంగా ఎదుర్కొంటాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.టీఓటీ దేశంలో ఇప్పటికే అమలులో ఉంది. టీఓటీ విధానంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించాం. ఆర్థిక వనరుల సమీకరణపైన అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చు అని సూచించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టీఓటీ విధానంలోనే.. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించాం’ అని కేటీఆర్ వివరించారు.’ప్రయివేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు అరోపిస్తున్న రేవంత్.. ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదు. లక్ష కోట్ల అవినీతి అని గతంలో ఔటర్ రింగ్ రోడ్డు లీజుపైన రేవంత్ రెడ్డి మాట్లాడిన అడ్డగోలు మాటలపైన.. హెచ్ఎండీఏ పరువు నష్టం కేసు వేసింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డిపైన హెచ్ఎండీఏ వేసిన కేసు అలాగే ఉంది. ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డుపైన అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారు. మరి కుంభకోణం అంటున్న ఔటర్ రింగ్ రోడ్డు లీజ్‌ను ఎందుకు రద్దు చేయడం లేదు. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి’ అని కేటీఆర్ ప్రశ్నించారు.’తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలి. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వెంటనే రద్దు చేసి.. సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరగాలి. ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే.. ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీ కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారు. జడ్జి ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తాం. మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపింది. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. దీనిపై కేటీఆర్ ఉన్నత న్యాయస్థానంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
కబుర్లొద్దు.. అంతా క్లియర్‌గా ఉందన్న టీపీసీసీ చీఫ్
ఫార్ములా ఈ-రేస్ కేసులో తాను కడిగిన ముత్యమంటూ కేటీఆర్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడంపై రియాక్ట్ అయ్యారు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్. ఫార్ములా ఈ- రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలున్నాయన్నారు. తనకు తానే కేటీఆర్ సర్టిఫికేట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించాక అక్రమ కేసు ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున కోర్టులో తేల్చుకోవాలని సూచన చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.ఈ-రేస్‌లో HMDA భాగస్వామ్యం కాకపోయినా విదేశీ సంస్థకు ఆనాడు 55 కోట్ల నిధులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అంతేకాదు మూడేళ్ల పాటు రేసింగ్ జరిగేలా 600 కోట్లతో ఒప్పందం జరగలేదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట ఏ మాత్రం పెరగలేదన్నారు.ప్రజలను ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ జాములు చేసి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారని మండిపడ్డారు. ఆధారాలు కనిపిస్తున్నా అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ బుకాయించడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధులు మంజూరు ఎలా చేస్తారని అన్నారు.హద్దుల్లేని కేటీఆర్ అక్రమాలతో అధికారులు బలిపశువులుగా మారారని చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్దంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఫార్ములా ఈ రేసు కోసం 2.8 కి.మీల ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. నిబంధనలను అతిక్రమించి ప్రజలను ఇబ్బంది పెట్టడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమా? బీఆర్ఎస్ నేతల దోపిడీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని, ఏం చేసినా వారి స్వలాభం కోసమేనన్నారు.ప్రజలు ఛీకొట్టి గద్దె దింపినా అధికారంలో ఉన్నామనే భ్రమలతో కేటీఆర్ బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. కేసులో అధికారులకు సహకరించాల్సిన కేటీఆర్, అహంకారంతో విర్రవీగుతూ ఉద్యమకారులంటూ కేసుకు సంబంధం లేని మాటలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్.
- Advertisement -