టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ డ్రగ్స్ కన్జ్యూమర్‌గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో విచారించింది. డ్రగ్స్ కేసు ఆధారంగా అతడికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన నవదీప్‌ను హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది.
గత నెల 14న హైదరాబాద్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మాధాపూర్ పోలీసులతో కలిసి గుడిమల్కాపూర్‌లో నిర్వహించిన ఆపరేషన్ మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో బెంగుళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్స్.. ఓ దర్శకుడితోపాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిని విచారించే సమయంలో ఇందులో డ్రగ్స్ కొనుగోలు కోసం హీరో నవదీప్ సంప్రదింపులు జరిపారని అతని స్నేహితుడు రాంచందర్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నవదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే హీరో నవదీప్ ను పోలీసులు విచారించారు. అతని ఫోన్స్ స్వాధీనం చేసుకుని.. డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇక ఇప్పుడు మరోసారి నవదీప్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.



