18.5 C
New York
Tuesday, April 16, 2024

కవిత ఇంట్లోఈఢీ ఐటీ రైడ్స్

- Advertisement -

కవిత ఇంట్లోఈఢీ ఐటీ రైడ్స్
హైదరాబాద్, మార్చి 15
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు  షాక్ తగిలింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తోంది. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ క్రమంలో కవిత రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు సమాచారం. మరోవైపు, కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు సంస్థల ముందు ఆమె విచారణకు హాజరవ్వాలా.. వద్దా.. అనే దానిపై ఆ రోజు విచారణ కీలకంగా మారనుంది.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని పిటిషన్‌ వేశారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోరారు.అయితే గతం లో ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత కు ఫిబ్రవరిలో సీబీఐ నోటీసులు జారీ చేసింది సీబీఐ. గత నెల 26 న విచారణకు రావాలని సీబీఐ ఈ మెయిల్ పంపింది. గతంలో ఒకసారి ఆమె నివాసంలోనే కవితను విచారించిన సీబీఐ.. 2022 డిసెంబర్ 11 న కవిత నివాసం లో స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. 14 నెలల తరువాత కవిత కు రెండో సారి ఫిబ్రవరి లో సీబీఐ నోటీస్ అందింది. అయితే ఈడీ నోటీసు ఇచ్చిన నెల రోజులకే సీబీఐ మరో నోటీసు జారీ చేసింది. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో పది మంది ఐటి అధికారులతో ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!