యాదవులను చైతన్యవంతులు చేయడానికి కృషి చేయాలి
Efforts should be made to sensitize the Yadavs
యాదవ సంఘం అడహాక్ కమిటీ జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్
జగిత్యాల,
జిల్లాలో ఉన్న యాదవులందరిని చైతన్య పరచడానికి యాదవ విద్యావంతులు, మేధావులు అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కృషి చేయాలని యాదవ సంఘం అడహాక్ కమిటీ జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్, జిల్లా ముఖ్య సలహాదారుడు కొలుముల రమణ యాదవ్, రెబ్బాస్ మల్లన్న యాదవ్ సుభాష్ యాదవ్ అన్నారు..
బుధవారం జిల్లా లోని బుగ్గారం మండల కేంద్రంలోని పోచమ్మ తల్లీ ఫంక్షన్ హల్లో యాదవ సంఘ సభ్యుల సమావేశాన్ని నిర్వహించి యాదవుల చైతన్యం,ఐక్యత,సమస్యల పరిస్కారం సభ్యత్వ నమోదు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు..
అనంతరం సభ్యత్వాలు తీసుకున్న సంఘ సభ్యులకు రసీదులను అందించారు.ఈ సందర్భంగా
యాదవ సంఘం అడహాక్ కమిటీ బుగ్గారాం మండల ఇంచార్జీలు గా ఎరవేణి వినోద్ యాదవ్, దొరగాండ్ల జగన్ యాదవ్ పెద్దినేని రాజేందర్ యాదవ్ లను ప్రకటించారు..
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎరవేణి వినోద్, పర్మాల రాజ శేఖర్,చిన్న గంగయ్య,చేదరి మల్లేశం ,గంతిల సురేష్ ,పర్మాల రాజేష్ ,సత్తన్న ,పెద్దినేని రాజేష్,జక్కుల భూమేష్,మోతుకు మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..