Monday, December 23, 2024

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలకు కృషి చేస్తా -మీడియా అకాడమీ ఛైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలకు కృషి చేస్తా
-మీడియా అకాడమీ ఛైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి

Efforts will be made to provide housing to all deserving journalists – Media Academy Chairman K. Srinivas Reddy

అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కే. శ్రీనివాస రెడ్డి అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఇప్పటికే పలు మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని, త్వరలో కొత్త పాలసీ రూపకల్పన ద్వారా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రతినిధులు మంగళవారం మీడియా అకాడమీ ఛైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, తమ సొసైటీ విషయాలపై చర్చించారు. గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తమ సొసైటీ 2008 లో ఏర్పడిందని, అప్పటి నుంచి మూడు దఫాలుగా జర్నలిస్టుల నుంచి సభ్యత్వం తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం సొసైటీలో 1300 మంది సభ్యులున్నారని అధ్యక్షుడు మామిడి సోమయ్య వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ పత్రికలు,ఛానెళ్ళలో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్టులు చాలా ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని, అయతే ఏ విధంగా ఇవ్వాలన్న విషయంలో కసరత్తు చేయాల్సి ఉన్నందున దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఉన్న 1300 మంది జర్నలిస్టుల అర్హత, సీనియారిటీ ప్రకారం లిస్టు సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు యర్రమిల్లి రామారావు, కరుణాకర్, అంజిరెడ్డి, నాగవాణి, టి. శాంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్