పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు ఎనిమిది సీట్లు కేటాయించాలి
బిఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ రాజకీయ పార్టీ లకు బూరుగుపల్లి వినతి పత్రాలు
హైదరాబాద్ ఫిబ్రవరి 5
తెలంగాణ భవన్, బి ఆర్ స్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి,గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి లనుకలిసి పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు ఎనిమిది సీట్లు కేటాయించాలని, బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఆద్వర్యం లో వినతి పత్రాలు అందజేసారూ. అనంతరం మీడియాతో బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూఅని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయస్ఫూర్తికి విరుద్ధంగా, బీసీలను రాజకీయంగా అణచి వేస్తున్నాయని , జనాభా దామాషా ప్రకారం విద్యా,ఉద్యోగ ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, ఉపాధి, రాజకీయ రంగాలలో సమాన వాట కల్పించాలని, బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన రాజకీయ పార్టీకే మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన నాయకులు ఆకుల శ్రీనివాస్, శివ రాములు, వెంకటేష్ యాదవ్, సె లేటి వెంకటేష్, గొడుగు నరసింహులు, మౌలానా తదితరులు పాల్గొన్నారు
పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు ఎనిమిది సీట్లు కేటాయించాలి

- Advertisement -
- Advertisement -