తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ కార్యవర్గ సభ్యురాలుగా బాలా త్రిపుర సుందరి ఎన్నిక,
వాయిస్ టుడే మహబూబ్ నగర్ జిల్లా
జడ్చర్ల నియోజకవర్గం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా జడ్చర్ల నియోజకవర్గం నాయకురాలు బాలా త్రిపుర సుందరి నియమితులయ్యారు.ఈ మేరకు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గురువారం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియమిస్తూ నియామక పత్రాన్ని ఆర్. బాలా త్రిపురసుందరికి అందజేశారు. కాగా గత రెండు సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీలో చేరిన బాలా త్రిపుర సుందరి పార్టీలో ఏ పదవి లేకుండానే పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తూ బీజేపీ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే జడ్చర్ల నియోజకవర్గం బీజేపీ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. న్యాయసేవల్లో న్యాయవాదుల పాత్ర కీలకం అసంతృప్తితో ఉన్న విషయాన్ని గమనించిన అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ మారాలని ఒత్తిడి చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధిష్టానం బాలా త్రిపుర సుందరితో చర్చించి కార్యవర్గ సభ్యురాలుగా నియమించారు. దీంతో పార్టీ మారుతారని పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. కాగా జడ్చర్ల నియోజకవర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిత్తరంజన్ దాస్ కు మద్దతుగా పార్టీ గెలుపు కొరకు బాలా త్రిపుర సుందరి అనుచరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు