Monday, March 24, 2025

శివరాత్రి మర్నాడే ఎమ్మెల్సీ ఎన్నిక

- Advertisement -

శివరాత్రి మర్నాడే ఎమ్మెల్సీ ఎన్నిక
కరీంనగర్, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే)

Election of MLC on Shivratri Marnaday

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ డేట్ కూడా శివయ్య ఆజ్ఞతోనే ఫిక్స్ అయినట్టుగా ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులు అటు ఓటరును ప్రాపకం చేసుకోవడంతో పాటు ఇటు శివయ్య అనుగ్రహం కోసం ప్రయత్నించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 26న శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలను సందర్శించుకునే అవకాశం ఉంటుంది. నది తీరాల్లో అయితే పుణ్య స్నానాలు చేసి ఆలయాల్లో శివనామస్మరణ చేస్తుంటారు. అంతేకాకుండా అదే రోజు రాత్రి జాగాహరణ చేస్తుంటారు. చాలా మంది కూడా పుణ్య క్షేత్రాలకు వెళ్లి శివయ్య సన్నిధిలోనే నిద్రాహారాల జోలికి వెళ్లకుండా రోజంతా గడుపుతారు. అయితే.. మరునాడే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండడంతో శివరాత్రి రోజున ఉపవాసం, జాగాహరణ చేసిన వారు పోలింగ్ కేంద్రాల వరకు వచ్చి ఓట్లేసే అవకాశం ఉంటుందా లేదా అన్న భయం అభ్యర్థులకు పట్టుకుంది.రోజున నిలాహారం, జాగాహారం చేసినందున మరునాడు రెస్ట్ తీసుకునేందుకే చాలా మంది మొగ్గు చూపుతుంటారు. వీరిలో తమ ఓటర్లు కూడా ఉండే అవకాశం ఉంటుందన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతున్నట్టుగా ఉంది. అయితే శివరాత్రి ఎఫెక్ట్ పోలింగ్ శాతంపై పడకుండా ఉండేందుకు ఇప్పటి నుండే అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.హుస్నాబాద్ పట్టణంలో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్టాడుతూ.. శివరాత్రి తెల్లవారే పోలింగ్ జరుగుతున్నందున ఓటర్లు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేయాలని సూచించారు.. మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. శివరాత్రి రోజున జాగాహరణ చేసిన వారంతా మరునాడు రెస్ట్ తీసుకుని సాయంత్రం కల్లా ఓటు వేయవచ్చన్న ధీమాతో ఉన్నట్టయితే సమయం ముగిసిపోతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంత్రి సూచించారు. అభ్యర్థులను తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించడమే కాకుండా పోలింగ్ కేంద్రాలకు ఖచ్చితంగా చేరుకునే విధంగా ఓటర్లను కోరాల్సిన పరిస్థితి ఎదురయింది.ఎఫెక్ట్ కారణంగా ఓటర్లు పోలింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపనట్టయితే తమ తలరాతలు మారే ప్రమాదం ఉంటుందని అభ్యర్థులు ముందుగానే వారిని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి కూడా తయారైంది. ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో గెలుపోటములు ఎలా ఉంటాయోనన్న ఆలోచనతో పాటు పోలింగ్ ఎంత మేర అవుతుందోనన్న ఆందోళన కూడా మొదలైనట్టుగా ఉంది.పోలింగ్ తగ్గే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో రాజకీయ పార్టీలు.. ఈ విషయాన్నీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లలేదు. వరుసగా సెలవుల కారణంగా పోలింగ్ తగ్గే అవకాశాలు ఉండటంతో అటు అభ్యర్థులు, ఇటు అధికారులు ఓటర్లకు సూచనలు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్