Friday, March 21, 2025

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో ఎన్నికలు

- Advertisement -

ఓటు హక్కు వినియోగించుకోనున్న 7 కోట్ల మంది

న్యూఢిల్లీ, నవంబర్ 16, (వాయిస్ టుడే ): దేశవ్యాప్తంగా  ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. విడతల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ  శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు జరిగే 48 గంటల ముందు ప్రచారానికి గడువు ముగుస్తుంది. దీంతో నేటితో ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడటంతో మైకులు మూగబోయాయి. ఎల్లుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 2.88 కోట్ల మంది ఉండగా.. 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 22.36 లక్షల మంది యువత కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతగా 20 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 17న మిగిలిన 70 స్థానాలకు నిర్వహిస్తున్నారు. రెండో విడతలో 958 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1.63 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్ కోసం ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో 18,883 పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది.ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 60 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Elections in Madhya Pradesh and Chhattisgarh
Elections in Madhya Pradesh and Chhattisgarh

గత ఎన్నికల్లో కేవలం 15 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకోగా.. జేసీసీ పార్టీ ఐదు, బీఎస్పీ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు అంచనా వేశాయి. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాల్లో గెలవగా.. బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏడాదికే కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఈ సారి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ వచ్చే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి.  మరో నాలుగైదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలను పార్టీలన్నీ సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి.  దీంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తోన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే వ్యూహలను సిద్దం చేసుకుంటోంది. ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసి బీజేపీయేతర పార్టీలను కలుపుకుంటోంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకంగా మారాయి. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ కీలకంగా తీసుకుంది. గెలుపొందేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉండగా.. రాజస్థాన్‌ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్