Sunday, September 8, 2024

ఎన్నికలు సజావుగా జరగాలి: రాచకొండ సిపి చౌహాన్

- Advertisement -

ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగవద్దు:

రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్ చౌహన్  గురువారం నాడు జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, ఇబ్రహింపట్నం సివిఆర్ కళాశాలలోని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భద్రత మీద సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టుగా  పేర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు ఎలక్షన్ కేంద్రాల చుట్టు ప్రక్కల 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు.

Elections should be conducted smoothly: Rachakonda CP Chauhan
Elections should be conducted smoothly: Rachakonda CP Chauhan

ప్రజలు అవసరం లేకుండా వీధుల్లో గుమిగూడడం నిషేధించినట్టు, అవసరమైన చోట చెక్ పోస్టులను ఏర్పాటు చేసామన్నరు.  అక్రమ నగదు తరలింపును అడ్డుకోవడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ తెలిపారు.

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎల్ బి నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ తో పాటు ఇతర అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్