కురుమ సంఘం భవనానికి విద్యుత్ కనెక్షన్ , వాటర్ కనెక్షన్ పూర్తి చేయాలి

- Advertisement -

కురుమ సంఘం భవనానికి విద్యుత్ కనెక్షన్ , వాటర్ కనెక్షన్ పూర్తి చేయాలి

Electricity connection&water connection to Kuruma Sangam building should completed

14 న సీఎం రేవంత్ రెడ్డి  చేత దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మ గౌరవ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
కురుమ సంఘం భవనానికి విద్యుత్ కనెక్షన్ , వాటర్ కనెక్షన్ పూర్తి చేయాలి
అధికారులు సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
జన సమీకరణ చేయాలని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కి కురుమ సంఘం ప్రతినిధులకు  సూచన
-మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్
ఈనెల 14 వ తేదిన నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ వద్ద దొడ్డి కొమరయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య , హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పై డా,, బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవన ప్రారంభోత్సవానికి దాదాపు 30 వేల మంది సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి జన సమీకరణ చేయాలని కురుమ సంఘం ప్రతినిధులకు ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వారికి కావాల్సిన వాహనాలను ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు సభ స్థల పరిశీలన తదితర వాటిని జిల్లా కలెక్టర్,పోలీస్ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. కురుమ సంఘం భవనానికి విద్యుత్ కనెక్షన్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్ కనెక్షన్స్ కి సంబంధించిన పేమెంట్ ను జిల్లా కలెక్టర్ చెల్లించాలని సూచించారు. సభ డయస్ ,బరికేడింగ్ , లైటింగ్ ,జనరేటర్ ,పార్కింగ్ తదితర వాటిపై ఆర్ అండ్ బి అధికారులకు సూచనలు చేశారు. స్టేజి డెకరేషన్ బ్యూటిఫికేషన్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తదితర వాటిపై సూచించారు. ఎల్ఈడి స్క్రీన్ ,బద్రత తో వచ్చేటువంటి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలిసులకు ఆదేశించారు. పవర్ సప్లై , సైట్ లెవెలింగ్ విప్ రూట్ ,పార్కింగ్ ,మెడికల్ క్యాంపు , అంబులెన్స్,సైనింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ,తాత్కాలిక మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని నర్సింగి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.అన్ని విభాగాలను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సమన్వయం చేసుకోవాలని సూచించారు.

సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య ,ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం బీసీ సంక్షేమ శాఖ  సెక్రటరీ శ్రీధర్ ,  హెచ్ఎండిఎ కమిషనర్ సర్పరాజ్ , బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి ,జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఐ అండ్ పిఆర్ కమిషనర్ హరీష్ , ,రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular