సమ్మోహ పరిచిన నేవీ బ్యాండ్

- Advertisement -

ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి అమర్నాథ్ దంపతులు

Enchanting navy band
Enchanting navy band

విశాఖపట్నం  నేవీ డే ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక సాముద్రిక నావెల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఇండియన్ నేవీ సింపోనిక్ బ్యాండ్ కన్సర్ట్ ప్రేక్షకులను సమ్మోహనపరిచిం ది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆయన సతీమణి హిమగౌరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమ ర్నాథ్ దంపతులకు తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండా ర్కర్, ఆయన సతీమణి,నవ ఈస్టర్న్ రీజియన్ ప్రెసిడెంట్ సంధ్య పెండార్కర్ ఘన స్వాగతం పలికారు. కమాండర్ మనోజ్ సభాష్టియన్, లెఫ్ట్నెంట్ కమాండర్ జె.పద్మనాభన్ నేతృత్వంలో సాగిన వాద్య విన్యాసం ప్రేక్షకులను మైమరిపించింది. కళాకారుల వాద్య విన్యాసాలకు ప్రేక్షకులు హర్షద్వా నాలతో అభినందించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ వాద్య కళాకారుల ను సత్కరించారు. అదేవిధంగా అమర్నాథ్ దంపతులను రాజేష్ పెండార్కర్ జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేవీ అధికారులు, నౌక దళ రిటైర్డ్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Enchanting navy band
Enchanting navy band
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular