1.4 C
New York
Monday, February 26, 2024

జమ్ము కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో ఎన్ కౌంటర్ 

- Advertisement -

జమ్మూ :అక్టోబర్ : జమ్మూ కశ్మీరులోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారాలోని నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తుండగా భారత సైనికులు కాల్పులు జరిపారు.

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు పాక్ చొరబాటుదారులను హతమార్చాయని పోలీసులు గురువారం తెలిపారు.

కుప్వారా పోలీసులు అందించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా మచల్ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

గురువారం ఉదయం నుండి ఆపరేషన్ జరుగుతోంది అని జమ్మూకశ్మీర్ పోలీసులు ఎక్స్ లో రాశారు. అంతకుముందు ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి చొరబాటు ప్రయత్నాన్ని విఫలమైనట్లు భారత సైన్యం తెలిపింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!