అత్తాపూర్ లో సుమారు కోట్ల విలువచేసే ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూమి కబ్జా
హైడ్రా నే న్యాయం చేయాలని కోరుతున్న స్థానికులు
రాజేంద్రనగర్
Encroachment of Endowments Department Land
Locals Appeal to HYDRA to Deliver Justice
అత్తాపూర్ రాంబాగ్ లోని 354/టు354/4 వరకు గల సర్వే నెంబర్ లోనీ భూమిని ఒక వర్గం వాళ్లు ఒక్కరోజులో చుట్టూ రేకుల షెడ్ వేసి కబ్జా చేశారు. ఆర్డిఓ ఆఫీస్ కి 100 మీటర్ల, దూరంలో, పోలీస్ స్టేషన్ కి అర్థ కిలోమీటర్ దూరంలో, జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీస్ కి 10 మీటర్ల దూరంలో, ఎండోమెంట్ ఆఫీస్ కి 50 మీటర్ల దూరం లో ఉన్న ఈ స్థలాన్ని చెక్ చావుని గురుద్వారా కి సంబంధించిన వ్యక్తులు కబ్జా చేశారు. అధికారులు ప్రోద్బలం తో నే ఈ కబ్జా జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ స్థలం విషయంలో వెంటనే హైడ్రాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. స్థానికంగా ఉన్న అత్తాపూర్ రామ్ బాగ్ హైదర్ గూడ పాండురంగ నగర్ ఉప్పరపల్లి పలు కాలనీవాసులు కలసి ఈరోజు ఉదయం నుంచి కబ్జా కి సంబంధించిన స్థలంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 400 మంది యువకులతో పాటు పార్టీలకు అతీతంగా శివాలయం ముందు ధర్నా నిర్వహించారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.
విషయంపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరియు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆందోళన చేస్తున్న స్థలానికి వచ్చి రెండు వర్గాలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. స్థలానికి సంబంధించి ఇరు వర్గాల పత్రాలు పరిశీలించి చర్యలు తీసుకుంటాం అని హైడ్రా కమీషనర్ రంగంనాథ్ తెలిపారు.



