అంతు లేని కథలు
Endless stories
విజయవాడ, ఆగస్టు 19
ఇటీవలి కాలంలో కుటుంబ వివాదాలు వీధికెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓవైపు ఇల్లీగల్ కాంటాక్ట్స్.. మరోవైపు ఆస్థి తగాదాలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు ఈ వివాదాల్లో ఉండటం గమనార్హం. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిల కుటుంబ పంచాయతీ పది రోజులుగా పరిష్కారం కాకుండా వివాదాల్లో నలుగుతూనే ఉంది. టెక్కలిలో నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి బలవంతంగా వచ్చి ఆందోళన చేసిన వాణిపై దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుఫై 41 నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే, నోటీసులు తీసుకోడానికి దువ్వాడ వాణి నిరాకరించారు. ముందు శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వాలని వాణి సూచించారు.తనపై దాడి చేశారంటూ దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు అయింది. ఐదు రోజుల క్రితం దువ్వాడ వాణి తరఫున పెద్ద మనుషులతో దువ్వాడ శ్రీను తమ్ముడు దువ్వాడ శ్రీధర్‌తో చర్చలు జరిపారు. పెద్ద మనుషుల సమక్షంలో ఐదు డిమాండ్లను దువ్వాడ శ్రీధర్‌కు తెలిపారు లాయర్ దివాకర్. 5 డిమాండ్లలో గ్రానైట్ క్వారీఫై, టెక్కలిలో ఉన్న ఇంటిపై ఉన్న అప్పులను తీర్చి వాణి కూతుళ్లపై రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా ఒప్పందానికి ప్రపోజల్ పెట్టారు. చిన్న కూతురు చదువు, వివాహం అంగీకరించిన దువ్వాడ శ్రీను.. ఐదు డిమాండ్లలో రెండు డిమాండ్లను అంగీకరించలేదు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న ఇంటిని రిజిస్ట్రేషన్ చేయనని దువ్వాడ శ్రీను తేల్చి చెప్పారు.దువ్వాడ వాణితో కచ్చితంగా విడాకులు తీసుకుంటానన్నారు దువ్వాడ శ్రీను. ఈ క్రమంలో ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు ఆయన. దువ్వాడ శ్రీను రెండు డిమాండ్లను అంగీకరించకపోవడంతో వాణి రూటు మార్చింది. దువ్వాడ శ్రీను తన భర్త.. ఆతనితో కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం అంటోంది. తాను మెట్టు దిగేఉన్నానని.. తాను ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదని.. అదంతా తప్పుడు ప్రచారం అంటూ వాణి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తనకు ఎలాంటి ఆస్తులు అక్కర్లేదంటోంది దువ్వాడ వాణి. తన పేరు మీద కానీ.. పిల్లల పేర్ల మీద కానీ.. ఆస్తులు రాయమని అడగలేదంటోంది. అందరం ఒకే ఇంట్లో ఉంటే సమాజంలో కుటుంబానికి గౌరవం ఉంటుందని వాణి తెలుపుతోంది. రాజకీయoగా తన భర్తను డ్యామేజ్ చేయవలసిన అవసరం తనకు లేదంటూ వాణి రూటు మార్చింది. దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణిల మధ్య కుటుంబ వివాదం నేటికీ కొనసాగుతోంది.ఇక… ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి చుట్టూ అలుముకున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆమె వ్యక్తిగత జీవిత అంశాలతోపాటు అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె వివాహం, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీద ఆమె చేసిన ట్వీట్ తదితర అంశాల మీద వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారుమరోవైపు విజయ్ సాయి రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో మదన్ ఆందోళన చేశాడు. కాగా, విజయవాడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మదన్‌పై శాంతి ఫిర్యాదు చేసింది. శాంతి, విజయసాయిరెడ్డిపై మదన్ హోం మంత్రికి ఫిర్యాదు చేశాడు. అయితే, ఇప్పటికే విచారణ పూర్తిచేసిన దేవాదాయ శాఖ ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె నుంచి వివరణ కోరినప్పటికీ.. శాంతి వివరాలు ఇవ్వలేదు. మీడియా తీరుపై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి.. మదన్‌తో శాంతి రాజీ చేసేందుకు నేతలతో ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే, శాంతిని వదిలేసి విజయసాయి రెడ్డి మదన్ టార్గెట్ చేశాడుఇక ఇటీవలే వివాదాల్లో నలిగిన రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య ఇష్యూలో.. రాజ్ తరుణ్, లావణ్య ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొని కోర్టు మెట్లు ఎక్కారు. కాగా, ముందస్తు అరెస్ట్ లేకుండా రాజ్ తరుణ్‌కు హైకోర్టులో ఊరట ఇచ్చింది. ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. రాజ్ తరుణ్ తనపై కొంత మందిని ఉసిగొల్పి తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడని లావణ్య ఆరోపిస్తోంది.మరోవైపు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మస్తాన్ సాయితో ఉన్న సంబంధంపై రాజ్ తరుణ్ ఇదివరకే క్వశ్చన్ చేశాడు. రాజ్ తరుణ్, మస్తాన్ సాయి తనపై కుట్ర పన్ని ఇలా అన్నిట్లోనూ ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. మస్తాన్ సాయి ఫోన్‌లో తన వ్యక్తిగత వీడియోలు ఉన్నాయంటోంది ఆమె. రాజ్ తరుణ్‌ను లావణ్య వేధిస్తుందంటూ తప్పుడు కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ లావణ్యపై శేఖర్ భాష పోరాటం చేస్తున్నాడు. రాజ్ తరుణ్ కోసం పెయిడ్ ఆర్టిస్ట్‌గా శేఖర్ బాష తనపై ఆరోపణలు చేస్తున్నాడని లావణ్య తెలుపుతోంది.రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం గత రెండు నెలల నుంచి రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతోంది. మరో వైపు తన వ్యక్తిగత ఫోటోలు బయటకు రిలీజ్ చేసి తన ప్రతిష్టను దిగజార్చిందంటూ ప్రీతి సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించింది. ప్రీతి, ఉదయ్‌లపై గంజాయి డ్రగ్స్ ఆరోపణలు చేసిన లావణ్య.. దానికి తగ్గ సాక్ష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలే నిదర్శనమని లావణ్య తెలుపుతోంది.మొత్తంగా దువ్వాడతో పాటు, విజయసాయి రెడ్డి, రాజ్ తరుణ్‌ల వ్యక్తిగత వ్యవహారాలు అంతులేని కథగా మారాయి.