NBK111 మూవీ నుంచి బాలయ్య బర్త్ డే సందర్భంగా ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్  

- Advertisement -

NBK111 మూవీ నుంచి బాలయ్య బర్త్ డే సందర్భంగా ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్  

‘Entry of an Era’ glimpse from the movie NBK111, released on the occasion of Balayya’s birthday.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని భారీ కాన్వాస్‌పై రూపుదిద్దుకుంటున్న #NBK111 చిత్రం కోసం మళ్ళీ జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, హై-వోల్టేజ్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా.  ఈ స్టార్-డైరెక్టర్ కాంబినేషన్ నుంచి  అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ట్రేడ్‌మార్క్ మాస్ మూమెంట్స్ తో సినిమా అద్భుతంగా అలరించబోతోంది. బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్ర నిర్మాతలు ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ పేరుతో ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

బాలకృష్ణ పాత్రను పరిచయం చేసేలా ఈ గ్లింప్స్‌ను రూపొందించారు. 1993 బాంబే అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ వీడియోలో డార్క్, హింసతో నిండిన ప్రపంచాన్ని చూపించారు. అలాంటి పరిస్థితుల్లో స్టైల్, ఇంటెన్స్, పవర్ కు ప్రతీకగా బాలకృష్ణ ఎంట్రీ అదిరిపోయింది. డైలాగ్స్ లేకుండానే విజువల్స్ ద్వారా పాత్ర పవర్‌ను అద్భుతంగా చూపించారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సాగాగా మలిచారు. భారీ యంత్రాలు, అగ్నిజ్వాలలు, ప్రాణాంతక ఆయుధాలు, విధ్వంసకర యాక్షన్ ఎపిసోడ్స్‌తో గ్లింప్స్ అంతా ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఫ్రేమ్ హీరో పాత్ర స్థాయిని మరింత ఎలివేట్ చేసేలా రూపొందించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రను ‘కింగ్ ఆఫ్ కేయాస్’గా ప్రజెంట్ చేశారు.
ఈ గ్లింప్స్‌ బాలకృష్ణ ఆదరగొట్టేశారు. సరికొత్త మేకోవర్‌లో ఆయన ఎంతో స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా, అత్యంత పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రను మరింత ఇంపాక్ట్ ఫుల్ గా నిలబెట్టింది.
డీవోపీ అరవింద్ ఎస్. కశ్యప్ తన కెమెరా పనితనంతో చిత్రానికి రగ్డ్, స్టైలిష్ విజువల్ టెక్స్చర్‌ను అందించారు. ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఊపునిచ్చింది. సినిమా స్థాయి, నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్ర సంభాషణలు అందిస్తుండగా, రామ్-లక్ష్మణ్, రవివర్మ, వెంకట్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు.
‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్ తో #NBK111 పై అంచనాలు భారీగా పెరిగాయి.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మనోజ్ మంచు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular