- Advertisement -
పోలీస్ అధికారులకు సిబ్బందికి ఎస్సే రైటింగ్ టెస్ట్..!
Essay writing test for police officers and staff..!
సిద్దిపేట
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఆధ్వర్యంలో సిద్దిపేట డివిజన్, గజ్వేల్ డివిజన్, హుస్నాబాద్ డివిజన్, డివిజన్ల వారీగా పోలీస్ అధికారులకు సిబ్బందికి ఎస్సే రైటింగ్ కాంపిటేషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. కానిస్టేబుల్ నుండి వరకు సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగుపరచడంలో పోలీసుల పాత్ర అనే అంశంపై ఎస్సే రైటింగ్ నిర్వహించడం జరిగింది.ఎస్ఐ నుండి పై స్థాయి అధికారి వరకు దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు అనే అంశంపై ఎస్సే రైటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. పోలీస్ అధికారులకు సిబ్బందికి ఎస్సే రైటింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు ముగ్గురిని సెలెక్ట్ చేసి, ఎస్ఐ నుండి పై స్థాయి అధికారి వరకు ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆరుగురు పేర్లు రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణం వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయిలో సెలెక్ట్ అయిన పోలీస్ అధికారులకు సిబ్బందికి అప్రిసియేషన్ సర్టిఫికెట్, నగదు రివార్డు అందజేయడం జరుగుతుందన్నారు.
- Advertisement -