బద్వేల్ లో ఓంకారం స్థాపన
Establishment of Omkara in Badvelబద్వేలు
బద్వేలు టౌన్ అనంతగిరి నందు ఓంకారం స్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభ జరుగుతున్న దృష్ట్యా అందుకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం బద్వేలు ఖండ హైందవ శంఖారావం కన్వీనర్ కొండపల్లి వెంకట సుభాష్ కుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ వెంకట సుభాష్ కుమార్ మాట్లాడుతూ 2025 జనవరి 5వ తేదీన విజయవాడలో జరగబోవు హిందూ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం నుండి విముక్తి చేయాలని, సనాతన హిందూ ధర్మరక్షణ కొరకు ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేయాలని, హిందూ ఆలయాలలో అన్యమతస్తులను తొలగించాలని, తిరుమల, శ్రీశైలం, అన్నవరం, విజయవాడ, శ్రీకాళహస్తి లాంటి ప్రధాన ఆలయ ప్రాంగణములో భక్తుల సౌకర్యార్థం అమ్మే పూజా సామాగ్రి షాపులు, హోటళ్ళు, వసతి గృహాలు మొదలైనవి హిందువులకు మాత్రమే టెండర్లు వేసి ఇవ్వాలని, భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం ఆధ్వర్యములో పూజలు, దర్శనాలు, ప్రసాద వితరణ జరగాలని, దేవాలయ భూములకు రక్షణ కల్పించాలి, అక్రమంగా కాజేసిన అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి సంభదిత దేవాలయాలకు అప్పగించే భాధ్యత కొరకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని, ఆలయ కమిటీ సభ్యులలో అన్యమతాస్తులని నియమించరాదని మొదలైన ప్రధాన డిమాండ్లతో హైందవ శంఖారావం పేరుతో రాష్ట్రములోని హిందూ సంఘాల ఆధ్వర్యములో పార్టీలకు అతీతంగా గొప్ప బహిరంగ సభ జరుగుతున్న దృష్ట్యా కార్యవర్గంతో పాటు, గౌరవ జట్టు సభ్యులు బిజెపి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఎస్ ఎస్ ఎఫ్ ఏబీవీపీ, భజరంగ్ దళ్, ఆలయ అర్చక సమాఖ్య కమిటీ, ఆలయ ధర్మకర్తల కమిటీ, వినాయక ఉత్సవ కమిటీ, విగ్రహ, అన్ని ఆలయాల నిర్వహణ కమిటీ సభ్యులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బద్వేలు ఖండ సంఘచాలక్ సి.రామకోటి రాజు, ఓంకారం స్థాపన గౌరవ కమిటీ సభ్యులు, బద్వేలు బద్దెన కళాపీఠం అధ్యక్షులు, గంగసాని సాంబశివారెడ్డి, గురుస్వామి బలపనూరు శంభూ ప్రసాద్, ఆర్య వైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కుప్పం వెంకట సుబ్బారావు, ఫ్రెండ్స్ సేవ సంఘం అధ్యక్షులు లాయం యోగా రాయల్, హిందూ సంఘాల నాయకులు కటారి రామయ్య, వాయలేటి సూర్య నారాయణ, చింతంరెడ్డి రామచంద్రా రెడ్డి, సి.వి. నాగేశ్వర రావు, బలిజ సంఘం ఉపాధ్యక్షులు పెరుగు వెంకటయ్య, ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వూరిబిండి జయారామి రెడ్డి, వర్తక సంఘం నాయకులు జయ మరియు ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ కనుమళ్ల సత్య నారాయణ శర్మ పాల్గొన్నారు.




