రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజేస్ ఏర్పాటు
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్
హైదరాబాద్ లో జరిగిన బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజరయ్యారు.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గోన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయబోతున్నాం. దావోస్ వేదికగా 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చాము. జీనోమ్ వ్యాలీ ఫేజ్-2ను త్వరలో ప్రారంభిస్తాం. మీకలలను సాకారం చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు. హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్ కు రాజధానిగా మారుస్తాం. ఫార్మా ఉత్పత్తుల్లో 1/3 హైదరాబాద్ నుంచే వస్తున్నాయని అన్నారు. . హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాకు జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ అవార్డును అందించి అభినందించారు.
రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజేస్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -