- Advertisement -
తెలంగాణ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ :జులై 08
తెలంగాణలో స్కిల్ యూని వర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు.
నివేదిక ఆధారంగా 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పా టు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నిం టీకీ అందుబాటులో ఉన్నం దున… సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించా లని చెప్పారు.
కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతీ ఐదు రోజు లకు ఓసారి సమావేసం కావాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.
- Advertisement -