20 C
New York
Tuesday, May 28, 2024

కుత్బుల్లాపూర్ లో ఈటల రోడ్ షో

- Advertisement -

కుత్బుల్లాపూర్ లో ఈటల రోడ్ షో

మేడ్చల్

కుత్బుల్లాపూర్ లో,మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. మే 13 తేదీ ,నాడు ఎన్నికలు సందర్భంగా చిత్తరమ్మ టెంపుల్ దగ్గర మొదలుపెటీ షాపూర్ నగర్ వరకు భారీగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల కాలంలో రేవంత్ రెడ్డి, ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు ఎక్కడ నిలబెట్టుకున్నారని మండిపడ్డారు, ఆడవారికి బస్సు ప్రయాణం ఒకటేనా ఇంకా 5 గ్యారంటీలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదని మండిపడ్డారు రైతులకు 2 లక్షల రుణమాపీ ఎక్కడ చేశారని చెప్పాలి. గృహలక్ష్మి ప్రతి మహిళకు 2500 ఇస్తారని ఎక్కడ ఇచ్చారు చెప్పాలి అన్నారు. మరోసారి దేశ ప్రజలను మోసం చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదని ప్రపంచంలో భారతదేశం అభివృద్ధిలో నంబర్ గా చేయాలంటే ప్రధాని నరేంద్ర మోడీ రావాలని అన్నారు. నిరుపేద వారికి ఇల్లు రావాలంటే మోడీ రావాలి. మల్కాజిగిరిలో ఉన్న సమస్యలన్నీ తీరుస్తానని నిరుద్యోగులకు ఐటి కంపెనీలు, మేడ్చల్ ఆల్వాల్ మల్కాజ్గిరి. కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు మెట్రో రైలు. వచ్చేలా కృషి చేస్తానని అన్నారు

 

ఈ కార్యక్రమంలో వేలాదిమంది ప్రజలతో కలిసి బిజెపి సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!