- Advertisement -
హైదరాబాద్: మాకు వచ్చిన ఓట్లు, సీట్లు చూస్తే రాబోయే కాలం లో బీజేపీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తో అధికారం సాధించే దిశలో పయనిస్తుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. డబ్బు, మద్యం ప్రభావం ను పక్కన పెట్టి ప్రజలు బీజేపీ కి విజయాన్ని కట్ట బెట్టారు. తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ కి ప్రజలు ఓటు వేశారు…వారికి కృతజ్ఞతలు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం అనూహ్యంగా పెరిగింది. మోడీ భారత ప్రజానీకానికి భద్రత , భరోసా ఇవ్వడమే కాకుండా భారత చిత్ర పటాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. 2014 వరకు ఎంత అభివృద్ది జరిగింది 2014 నుండి 2023 వరకు అంతకన్నా ఎక్కువ అభివృద్ది జరిగిందని అన్నారు.
- Advertisement -