Monday, March 31, 2025

ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హత

- Advertisement -

ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హత
వరంగల్, మార్చి 27, ( వాయిస్ టుడే)

Even if you have three children, you are eligible to compete.

తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మెుదలైంది. గ్రామాల్లో ఏ నలుగురు ఓ చూట గూమి కూడినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని వారు ఎదురు చూస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారం కూడా మెుదలుపెట్టారు. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవి వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటున్న వారు పల్లెల్లోనే మకాం వేసి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో మంచి, చెడులతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమవుతున్నారు.అయితే ప్రస్తుతం ముగ్గురు పిల్లు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేయటానికి అవకాశం లేదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం.. 1995 తర్వాత ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఈ నిబంధన చాలా మంది ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలు ఉన్నా.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సైతం ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.ముగ్గురు పిల్లలు ఉన్నవారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. ఈ నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. శాసనమండలిలో మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆమోదించారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క వెల్లడించారు. పట్టణ ప్రణాళిక కోసమే గ్రామాలను విలీనం చేస్తున్నామని చెప్పారు. ప్రజల అభిప్రాయం మేరకు కలెక్టర్లు పంపించిన ప్రతిపాదనల ఆధారంగా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నామని సీతక్క వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో విలీనమైన గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం గురించి కూడా ఆమె మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా వేరే పథకం అమలు చేస్తామని చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు.కాగా, తెలంగాణలో మెుత్తం 540 మండలాల్లోని 12,966 గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 1,14,620 వార్డులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించనుంది. అందుకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఎస్‌ఈసీకి సమర్పించింది. గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్‌ల పదవీ కాలం, జులైలో ఎంపీటీసీల పదవీకాలం ముగియగా.. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారులు పాలనను సాగిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్