38 మంది ఎమ్మెల్యేలున్నా…రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు.?
మంత్రి బాండీ సంజయ్ కుమార్ హాట్ కామెంట్హైదరాబాద్
Even the MLAs…why didn’t they contest the Rajya Sabha elections?
కవితకు బెయిల్ కోసం కోర్టులో సింఘ్వి వాదనలు ఎందుకు విన్పించారుకాంగ్రెస్ తో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ కు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?మాకు 38 మంది ఎమ్మెల్యేలుంటే నామినేషన్ వేసే వాళ్లం.విగ్రహాల లొల్లి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా,హైడ్రా కూల్చివేతల వెనుక కలెక్షన్ల దందా,హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఖర్చు కోసమే.
బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలున్నా రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు నామినేషన్ వేయలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇఫ్పించేందుకు కోర్టులో వాదనలు విన్పిస్తూ విశ్వ ప్రయత్నం చేసినందుకు ప్రతిఫలంగానే కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించలేదన్నారు. రాజ్యసభ అభ్యర్ధి అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధి అని పేర్కొన్నారు. ఈరోజు సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ఏమన్నారంటే:
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించాం. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా సభ్యత్వ నమోదు విషయంలో జోష్ తో ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగింది. ప్రజలంతా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కోసం ఎదురు చూస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గత కొన్నేళ్లుగా దొంగ నాటకాలాడుతూ ప్రజల్లో అయోమయం స్రుష్టించారు. ఈరోజు తెలంగాణ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చింది. అదేమిటంటే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని స్పష్టత వచ్చింది. త్వరలోనే వాస్తవ రూపం దాల్చబోతోంది.కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాయకుడు, కేసీఆర్ ముద్దుల కూతురు కవితకు బెయిల్ ఇప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేసి కోర్టులో వాదనల్లో విన్పించారు. ఆయన వాదనలు విన్పించినందుకే కేసీఆర్ సూచన మేరకు కాంగ్రెస్ అభ్యర్ధిగా సింఘ్వీని ప్రకటించారు. ఇది వాస్తవం రాజ్యసభ నామినేషన్లకు చివరి రోజు. 38 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తమ అభ్యర్ధిని ప్రకటించలేదు? ఎందుకు పోటీ చేయడం లేదో సమాధానం చెప్పాలి. మాకు 8 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి పోటీ చేయలేకపోయాం. బీఆర్ఎస్ లెక్క అంతమంది సభ్యులుంటే మేం బరాబర్ పోటీ చేసే వాళ్లం. నిజానికి బీఆర్ఎస్ పోటీ చేస్తే రాజ్యసభ సీటు గెలిచేవాళ్లు. ఎందుకంటే కాంగ్రెస్ సభ్యుల్లో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగేది. మాకున్న సమాచారం మేరకు. దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు.కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రాజ్యసభ అభ్యర్ధి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్ధి. అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. రెండు పార్టీల మధ్య మాట, ముచ్చటైంది. ఇక కళ్యాణమే తరువాయి. వాస్తవాలను తెలంగాణ సమాజం గుర్తించాలని కోరుతున్నా.
బీజేపీని ఇన్నాళ్లు బదనాం చేయడానికి అనేక దుష్ప్రచారాలు చేశారు. 6 గ్యారంటీలపై ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కుట్రలు చేస్తున్నారు. రైతులు రుణమాఫీ కాక అల్లాడుతున్నరు. రైతు భరోసా రాక బాధపడుతున్నరు. నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి కోసం, మహిళలంతా స్కూటీ, తులం బంగారం, రూ.2500, వ్రుద్దులు 4 వేల ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నరు. దీనిపై చర్చ మళ్లించడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా,
ఇకనైనా విగ్రహాల లొల్లి బంద్ చేయాలి. ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టాలి. మాకు కూడా మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉంది. కానీ దీనిపై ఇప్పుడు చర్చ పెట్టడం లేదు. ఇప్పుడు కావాల్సింది 6 గ్యారంటీల అమలు. దీనిపై చర్చ పెట్టాలి.
హైడ్రా దాడుల వెనుక తతంగం వేరే ఉంది. అంత కలెక్షన్ల దందానే. గుంట, రెండు గుంటల్లో ఇండ్లు కట్టుకంటే కూల్చివేస్తున్న అధికారులు ఎకరాల కొద్దీ ఫాంహౌజ్ లు కట్టుకున్న వాళ్లవి ఎందుకు కూల్చడం లేదు? కబ్జాల్లో ఎక్కువ కాంగ్రెస్ నేతలవే ఉన్నయి. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్ల్లో కలెక్షన్ల కోసమే ఈ దందా. హైడ్రా అధికారి రంగనాథ్ ది ఏముంది? రాసిచ్చిందే చదువుతారు. ఆయన గతంలో నాపై కూడా కేసు పెట్టారు కదా



