సికింద్రాబాద్, అక్టోబర్ 28 (వాయిస్ టుడే ప్రతినిధి): మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి విసిరిన సవాల్, తెలంగాణ ప్రజలకు కర్ణాటక మోడల్ కావాలా తెలంగాణ మోడల్ కావాలా అని నిర్ణయించుకోవాలని విసిరిన సవాల్ ను కాంగ్రెస్ నాయకులు వంశీ చంద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వీకరించి ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఓయూ లో మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి బస్ పెడతామని అదే బస్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కర్ణాటక కి వెళ్దాం సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ కు ఓయూ కి వచ్చి విద్యార్థులను ఎదుర్కొనే దమ్ము ఉందా అని అన్నారు. తెలంగాణ లో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెపుతున్నారు. అదే నిజమైతే బహిరంగ చర్చకు రావాలన్నారు. కాలేశ్వరం మేడిగడ్డ బావి లో లక్షణ కోట్ల అవినీతి జరిగిందని, లక్షల కోట్ల కక్కుర్తి పడి కాలేశ్వరం పరిస్థితిని ఎలా మార్చారో చూపిస్తానని అన్నారు. వెళ్తూ వెళ్తూ అదే దారిలో గిరిజన తండాలకు వెళ్లి గిరిజనులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఇచ్చారా డబల్ బెడ్ రూమ్ లు గిరిజనులకు అందాయా లేదా కనుక్కుంటూ, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అక్కడ ఎన్ని ఖాళీలు భర్తీ చేశారో లెక్క కడుతూ వెళ్దామని, విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయలేదని అవి కూడా లెక్క కడదామని బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 190000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందులో ఎన్ని భర్తీ చేశారో లెక్క కడదామన్నారు టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఇవ్వకపోవడం గుర్తుచేస్తూ…టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని.. టిఆర్ఎస్ పార్టీ విసిరిన సవాల్ నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొని నిరుద్యోగుల తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆర్ట్స్ కాలేజ్ వద్దకు వచ్చిందని టిఆర్ఎస్ పార్టీకి దమ్ము లేక ఇక్కడికి రాలేదని కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తుందని గతంలో కాంగ్రెస్ నెరవేర్చిన హామీలను తెలియపరిచారు, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాల హామీని తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు.




