Saturday, February 15, 2025

ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

- Advertisement -

ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

Every complaint should be responded to quickly and efforts should be made to ensure immediate justice to victims

వార్షిక తనిఖీల్లో జగిత్యాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల,
పోలీస్ స్టేషన్ కు
ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.సోమవారం  వార్షిక తనిఖీ లో భాగంగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని,
బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని అన్నారు. పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కార్, బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని సంఘటన స్థలానికి  నిమిషాల్లో చేరుకునే విధంగా పని చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసుల గురించి,పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ల పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ను పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటా ను తనిఖీ చేశారు. రిసెప్షనిస్ట్ గా ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్  మేనేజ్మెంట్ లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5ఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలు తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. సైబర్ నేరాల బారిన పడకుండా పరిధి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన పెంచాలన్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలన ఆక్సిడెంట్ జోన్ లుగా,  బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి,రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి  తీసుకొని రావాలని సూచించారు.ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేసే విధంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ను ఎస్పీ ప్రారంభించారు,పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, డీసీఆర్బీ  ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సైలు కిరణ్ కుమార్, మన్మధరావు, గీత, మల్లేశం,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్