హుషార్ పిట్టలు’ మూవీ కంటెంట్ అందరికీ నచ్చింది – నిర్మాత వెంకట్ యాదవ్
Everyone liked the content of the movie ‘Hushar Pittalu’ – Producer Venkat Yadav.
అన్ష్, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెక్కెం వేణుగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..
*నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ అందరికీ నచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ టైంలో నాకు సురేష్ బాబు గారు, శిరీష్ గారు, బెక్కెం వేణు గోపాల్ గారు సహాయం చేస్తున్నారు. మేమంతా కష్టపడి సినిమాని తీశాం. మేం ఒంటరిగా పోరాడుతున్నాం. మా ఈ పోరాటంలో మీడియా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు వాళ్లందరం కలిసి చేసిన సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చెప్పిన కథను భిక్షు తెరపైకి అద్భుతంగా తీసుకు వచ్చారు. రుద్ర సాయి గారి విజువల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. చరణ్ అర్జున్ గారు ఈ సినిమాకి ఓ పిల్లర్. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ఫైనాన్షియర్ శివకు థాంక్స్. సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
*అన్ష్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాతో హిట్టు కొట్టబోతోన్నా అని తొడ గొట్టి చెబుతున్నా. చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద నాటకాలు వేస్తుండేవాడిని. కృష్ణా నగర్‌లో జరిగిన ఓ ఆడిషన్‌కి వెళ్తే.. అక్కడ కాఫీ కప్పులు తీయించారు. కానీ నా అభిమాన హీరో చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని ముందుకు కదిలాను. కళామతల్లికి కిరీటంలా కాకపోయినా పాదాల వద్ద పుష్పాన్ని అయితే చాలని అనుకుంటున్నాను. సురేష్ బాబు గారు మాకు అయ్యప్ప స్వామి రూపంలో వచ్చినట్టుగా అనిపించింది. మా ‘హుషార్ పిట్టలు’ సినిమాని సపోర్ట్ చేస్తున్న ఆయనకు థాంక్స్. ఈ సినిమాకి చరణ్ అన్న, చిరంజన్ అన్న, సింగర్స్, డీఓపీ సాయి అన్న ప్రాణం పోశారు. ఆగస్ట్ 15న మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ వాసవి గణేశన్ మాట్లాడుతూ “” ఈ సినిమా ప్రివ్యూ చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు..మా అమ్మమ్మ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తున్నారు..ఇది ఒక జనరేషన్ ను మార్చే సినిమా ఇది అన్నారు
*కెమెరామెన్ రుద్ర సాయి మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్య నిర్మాతలకు సరైన లాభాలు రావడం లేదు. నిర్మాతలు బాగుంటేనే సినిమాల్ని బయటకు తీసుకు రాగలరు. వెంకట్ గారికి ఈ చిత్రంతో మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*లిరిసిస్ట్ చిరంజన్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. ఆల్రెడీ మాకు హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా చూసి పిల్లలు, పేరెంట్స్ ఎంతో నేర్చుకుంటారు.
*నటుడు గోవర్దన్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ చిత్రంలో స్టార్స్ లేరు. కానీ స్టార్ మేకర్స్ (ఆడియెన్స్) ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే వేసిన ప్రీమియర్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మా సినిమాని చూసిన వారంతా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి, చప్పట్లు కొడుతున్నారు. ఆగస్ట్ 15న మా సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు చరణ్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్. ఆగస్ట్ 15న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
*నటుడు భాను మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాలో పుట్ట భాను పాత్రను పోషించాను. స్టేజ్ మీద నేను ఎమోషనల్ అయ్యాను. నా ఎమోషన్‌కి అందరూ కనెక్ట్ అయ్యారు. విమర్శించే వారు కూడా మా సినిమాని చూడండి. మూవీ చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి’ అని అన్నారు.
తారాగణం : వాసవి గణేశన్, అన్ష్, గోవర్ధన్, సునీత మనోహర్, రమేష్, అంజి వల్గుమాన్ తదితరలు




