ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు తప్పక పాటించాలి
సిఐ రమేష్ బాబు
ఆళ్లగడ్డ
మే 13న జరిగే ఎన్నికలకు సంబంధించి ఆళ్లగడ్డ పట్టణ సీఐ రమేష్ బాబు ప్రజలకు రాజకీయ పార్టీలకు పలు కీలక సూచనలను చేశారు ఈ సందర్భంగా ఆయన గురువారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం సంబంధంలేని ఓటర్లు ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ పట్టణంలో సంచరిస్తే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాగే రాజకీయ పార్టీలు కూడా పోలీసు వారికి సహకరించి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులను తమ వెంట తిప్పుకోకూడదని సూచించారు ప్రజలు కూడా ఓటును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఎవరైనా కొత్త వ్యక్తులు ద్వారా ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి సమస్యను తీసుకొని రావాలని మీడియా ముఖంగా ఆయన ప్రజలకు సూచించారు అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఓటరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఓటు వేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని ముఖ్యంగా కేంద్ర బలగాలతో ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు కవాతులను సైతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు తప్పక పాటించాలి సిఐ రమేష్ బాబు

- Advertisement -
- Advertisement -