- Advertisement -
హరీష్ రావు నివాసంలో రాఖీ వేడుకలు
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు మంత్రికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్ళకు పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు తోడుగా ఉంటుందని వారి భద్రత, రక్షణ, సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు.

- Advertisement -



