సికింద్రాబాద్
తార్నాక కాలనీ అసోసియేషన్ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశనుంచి ఉద్యమల్లోనుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేను పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతంకోసం ఎలాంటి విపత్కార పరిస్థితి వచ్చిన పార్టీలోనే కొనసాగను పూర్తిగా పార్టీకోసమే సమయం ఇచ్చే కార్యకర్తను నేను . మోదీ నాయకత్వం లో మంత్రి గా విధులు నిర్వర్థిస్తూ ఆర్టికల్ 370 రద్దులో నేను భాగం అయ్యాను.
సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వం ద్వార తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం వంటి వాటి నుంచి బయటపడ్డాం. 2014 తర్వాత మోడీ వచ్చాక దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాం. టెర్రరిజం పైన జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు వెళ్తున్నాం. మోడీ మళ్లీ ప్రధాని అయితే రాజకీయాలకు అతీతంగా దేశం మరింత ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి. పార్టీలకు అతీతంగా దేశం కోసం పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటెయ్యండి. మీరు ఓటెయ్యండి.. తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి ఓటెయ్యమని చెప్పండి అది మీ బాధ్యత మన బాధ్యత. బిజెపిని మోదీ ని ఆశీర్వదించండి. నన్ను గెలిపించండని అన్నారు.
ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి.

- Advertisement -
- Advertisement -