ఆరోగ్యం పై ప్రత్యేక ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి
హైదరాబాదు జూన్ 26
ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని మరియు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి కోరారు. నేడు బోరబండలో మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటిని ఎక్కువ కాలం నిలువ ఉండకుండా మార్చాలని సూచించారు. పరిసర ప్రాంతాలలో అపరిశుభ్రంగా ఉంటే సంబంధిత అధికారులకు తెలిపి సమస్యను పరిష్కరించుకోవాలని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి తెలిపారు.
ఆరోగ్యం పై ప్రత్యేక ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి
- Advertisement -
- Advertisement -



