Saturday, March 21, 2026

కాలనీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.

- Advertisement -

కాలనీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.
— ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి : ఫిబ్రవరి 5(వాయిస్ టుడే)
కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలవతో సన్మానించి, అభినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ హనుమాన్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. అదేవిధంగా హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని , ఏ చిన్న సమస్య ఐన కార్పొరేటర్ దృష్టికి గాని, తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని,నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళాల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ, ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మౌలిక వసతుల కల్పనకై పెద్ద పీట వేస్తానని, హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ భాగస్వామ్యంతో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షుడు ఎం.విఠల్, ప్రధాన కార్యదర్శి బి.విఠల్, కోశాధికారి వీరేశం, ఎల్లంనాయుడు, నర్సింహులు, ఎర్రన్న, రాము, టైల్స్ శ్రీను, కాశిమ్ యాదవ్, మల్లేష్ యాదవ్, జోగరావు, లోహిత్, అప్పారావు, పరమేష్ గౌడ్, తిమ్మప్ప, రాంచందర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్