- Advertisement -
ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
Everyone should strive for the conservation of nature.
ఆలేరు: బతుకమ్మ, దసరా పండుగలు ప్రకృతితో మనకున్న విడదీయలేని అనుబంధానికి ప్రతీకలని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి అన్నారు. బతుకమ్మలో పూలను, దసరా సందర్భంగా జమ్మిచెట్టును పూజించడం ప్రకృతికి మన సంస్కృతిలో ఉన్న ప్రాధాన్యాన్ని చాటుతుందని పేర్కొన్నారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి స్ఫూర్తితో పర్యావరణానికి హాని కలిగించే అలవాట్లను విడనాడాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని సూచించారు
- Advertisement -




