గంజాయి సాగు రహితమే అందరి లక్ష్యం

- Advertisement -

గంజాయి సాగు రహితమే అందరి లక్ష్యం
.

Everyone's goal is to be cannabis-free

అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ వెల్లడి
అల్లూరి
జిల్లాలో గంజాయి సాగు రహితమే అందరి లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేసారు. గంజాయి సాగు నిర్మూలన పై అధికారులకు దిశా నిర్దేశం చేసారు. గంజాయిని సాగు చేసినా , అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, ఉద్యానవన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసిడిఎస్, డ్వామా, డి. ఆర్. డి. ఏ అధికారులతో గంజూయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై మంగళవారం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గంజాయి సాగుపై ఫిర్యాదుల స్వీకరణకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖలలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలలో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. కళాశాలల్లో అవగాహనా సదస్సులు, డి ఎడిక్షన్ సెంటరుకు ఎంత మంది వచ్చాని సంబంధిత అధికారులను అడిగి తెలుసు కున్నారు. గంజాయి సాగు చేసే రైతులు, సరఫరాదారులుపై ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. గంజాయి విడిచి పెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, స్వయం ఉపాధి పథకాలు, బ్యాంకు రుణాలు, పశువులు, మేకలను మంజూరు చేయాలని స్పష్టం చేసారు. జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాలు, విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సమావేశం రోజున గంజాయి వినియోగం వలన వచ్చే ఆరోగ్య సమస్యలపై చర్చించాలని సూచించారు.
డి. ఐ. జి గోపీ నాధ్ జెట్టి మాట్లాడుతూ జిల్లాలో గంజాయిని సమూలంగా అరికట్టాలని పేర్కొన్నారు. భావి తరాలకు గంజాయి వలన నష్టం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. గంజాయి నిర్మూలనలో భాగమైన ప్రభుత్వ శాఖలు లక్ష్యాలను నిర్దేశించుకుని పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసారు. గంజాయిలో భాగ స్వామ్యమైన వారి వివరాలు సేకరిస్తున్నామని అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సమాజంలో గంజాయి నిర్మూలనపై పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంత చేయాలని చెప్పారు.
జిల్లా ఎస్సీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ నిరుద్యోగం ఎక్కువగా ఉందన్నారు. యువతకు స్వయం ఉపాధి పథకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. గిరిజన యువతకు రుణ ప్రణాళికలు అమలు చేయాలని చెప్పారు. జి.మాడుగుల, చింతపల్లి, ముంచంగిపుట్టు, జి.కె. వీధి, కొయ్యూరు మండలాలపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ మాట్లాడుతూ గంజాయి సాగును విడిచిపెట్టిన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. గిరిజన రైతులకు ఉద్యాన వన పంటలను అందిస్తామన్నారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మండలాల వారీగా గంజాయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై పక్కాగా కార్యచరణ అమలు చేయాలని అన్నారు. మండల స్థాయి, గ్రామ స్థాయి, ఐటిడి ఏ స్థాయిలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిరుద్యోగ గిరిజన యువతకు ప్రధాన మంత్రి ఉపాధి హామీ పథకంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పి.వి. టి. జిలకు ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ అదనపు ఎస్పీ ధీరజ్, డి ఆర్ ఓ బి. పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. బి. ఎస్. నంద్, జిల్లా ఉద్యాన వన అధికారి రమేష్ కుమార్ రావు,గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ. కొండలరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జమాల్ భాషా, డి. ఆర్. డి. ఏ పి.డి వి. మురళి, ఐసిడి ఏస్ పి.డి సూర్యలక్ష్మి వివిద శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular