పెళ్లికి అంతా రెడీ…
క్యూట్ కపుల్ ఆస్తుల 100 కోట్ల పైనే
హైదరాబాద్, ఫిబ్రవరి 19, (వాయిస్ టుడే )
Everything is ready for the wedding… The cute couple’s assets are over 100 crores.
టాలీవుడ్ బెస్ట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ఈ నెల 26న జరగనుందని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నా… మరోవైపు అటు విజయ్ నుంచి ఇటు రష్మిక నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. వీరి పెళ్లి ప్రకటన ఎప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్‌గా పేరొందిన ఈ కపుల్ ఆస్తుల నికర విలువ ఓసారి చూస్తే…’నువ్విలా’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ మూవీతో స్టార్ హీరోగా మారారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గీత గోవిందంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారు. తన నటనతో బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.విజయ్ దేవరకొండ నెట్ వర్త్ ఓసారి చూస్తే… హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ లగ్జరీ భవనంలో తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నారు. దీని విలువ రూ.15 కోట్లు అని తెలుస్తోంది. ఆయన వద్ద BMW 5 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో XC9,0 రేంజ్ రోవర్‌తో సహా ఇతర కార్లు ఉన్నాయి. ఆంగ్ల మీడియా రిపోర్ట్స్ ప్రకారం… ఆయనకు ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదిస్తున్న నటుల్లో విజయ్ ఒకరు. దాదాపు రూ.70 కోట్ల నెట్ వర్త్ విజయ్ దేవరకొండ కలిగి ఉన్నట్లు వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది.విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు దాదాపు రూ.12 కోట్ల నుంచి రూ.30 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలతో పాటు యాడ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ఈవెంట్స్‌తో పాటు తన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు. ఫ్యాషన్ పట్ల విజయ్‌కు ఎంతో ఇష్టం ఉంది. దీంతో ఆయన సొంత స్ట్రీట్ వేర్ బ్రాండ్ రౌడీ వేర్ డిజైన్ చేసుకున్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అనే ప్రొఫెషనల్ పురుషుల వాలీబాల్ జట్టుకు కూడా ఆయన కో ఓనర్. విజయ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం దాదాపు రూ.కోటి. పెయిడ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కోసం రూ.40 లక్షలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్, అటు బాలీవుడ్‌లోనూ వరుస విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక. ఫోర్బ్స్ ప్రకారం, రష్మిక నెట్ వర్త్ రూ.66 కోట్లు. బెంగుళూరులో రూ.8 కోట్ల విలువైన లగ్జరీ హౌస్‌తో పాటు హైదరాబాద్, ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్‌ల్లో కూడా ఆస్తులు కలిగి ఉంది. FE నివేదిక ప్రకారం ఆమె ఒక చిత్రానికి రూ.4 కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ లాగా ఈమె వద్ద కూడా ఆడి Q3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడిస్ బెంజ్ సి క్లాస్ లగ్జరీ కార్లను కలిగి ఉంది.ఇక ఈ నెల 26న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్‌లో విజయ్, రష్మికల పెళ్లి కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనుందని ప్రచారం సాగుతుండగా… హైదరాబాద్ తాజ్ కృష్ణ లగ్జరీ హోటల్‌లో మార్చి 4న రిసెప్షన్ జరగనున్నట్లు తెలుస్తోంది.



