Monday, February 16, 2026

విజయవాడ వరద భాదితులను ఆదుకోవడానికి సర్వం సిద్ధం

- Advertisement -

విజయవాడ వరద భాదితులను ఆదుకోవడానికి సర్వం సిద్ధం

Everything is ready to help Vijayawada flood victims

తాడేపల్లిగూడెం లోని దాతలు ఇంకా ముందుకు రావాలి

– వరద బాధితుల కోసం తాడేపల్లిగూడెం నియోజవర్గం నుంచి ఎటువంటి సహాయక కార్యక్రమాలైన చేయడానికి సిద్ధం

– ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం,
ఇటీవల భారీ వర్షాలకు వరద ముంపుకు గురైన విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాసులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద బాధితులకు సహాయార్థం తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఎటువంటి సహాయక కార్యక్రమాలైనా చేయడానికి సిద్ధమంటూ ఆయన అధినాయకులకు సమాచారం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసిన అనంతరం  ఆయన నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తాడేపల్లిగూడెం నుంచి ఇప్పటికే లక్ష వరకు ఆహార పట్ల సిద్ధం చేసిన ఆయన వివిధ గ్రామాలు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నుండి వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ బ్రెడ్స్ వంటివి తాడేపల్లిగూడెం నుంచి తరలించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెం లోని దాతలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే వరద తీవ్రత తగ్గేంత వరకు విజయవాడలోనే ఉండి తాడేపల్లిగూడెం నుండి అవసరమైన ఆహార పదార్థాలను సమకూర్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్