ఈవీఎం గోదామును
పరిశీలించిన జిల్లా కలెక్టర్
EVM warehouse
Inspected District Collector
కరీంనగర్
కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను పర్యవేక్షించారు. ఈవీఎంలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు భద్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్, ఆర్డిఓ కే మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో సుధాకర్, కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ రమేష్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జాగిరం శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బిజెపి ప్రతినిది నాంపల్లి శ్రీనివాస్, టిడిపి ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య, తదితరులు పాల్గొన్నారు.