హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ

- Advertisement -

హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ❄️ —

ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

Ex-MLA Bomma Venkanna statue unveiling in Husnabad 

వాయిస్ టుడే ప్రతినిధి(హుస్నాబాద్ నియోజకవర్గం)డిసెంబర్ 10:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ,సిద్దిపేట డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి , సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల జయరాజ్ ఇతర ముఖ్య నేతలుపాల్గొన్నారు మంత్రి పొన్నం మాట్లాడుతూ ఒక్కొక్కరుగా బొమ్మ వెంకన్న తో ఉన్న సంబంధం గుర్తు చేశారు 1986 లో డిగ్రీ కాలేజి విద్యార్థి బొమ్మ వెంకన్న చొక్కారావు గకి శిష్యుడు . కాలేజి గొడవ లో వాళ్ల దగ్గరకు పోయేవాడి నన్నారు 1987 లో విద్యార్థి నాయకుడిగా గెలిచానన్నారు 1991-92 లో NSUI జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి వచ్చానన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం బొమ్మ వెంకన్న కమ్యూనిస్టు పార్టీ దేశినీ మల్లయ్య తో సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు బొమ్మ వెంకన్న కి ఘన నివాళులుఅర్పించారు నాకా చౌరస్తా లో నలుగురు విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు బొమ్మ వెంకన్న , దేశినీ మల్లయ్య , బొప్పరాజు లక్ష్మీకాంత రావు గార్ల విగ్రహాలు పెట్టుకుందామన్నారు వారు ఇచ్చిన మార్గదర్శకత్వం తో మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచి ..మంత్రి నయ్యానన్నారు సంవత్సరం క్రితం చెప్పా హుస్నాబాద్ కి ప్రాధాన్యత కల్పిస్త అని చెప్పా.. గౌరవం పెంపొందిస్తున్నన్నారు ఏదైనా శుభకార్యాలకు లెటర్స్ పంపిస్తుంటా ఇది బొమ్మ వెంకన్న దగ్గర నుండి నేర్చుకున్నన్నారు నా దగ్గరకు ఏ లెటర్ వచ్చిన దానికి స్పందిస్తనన్నారు. నా రాజకీయ గురువు చొక్కారావు చెప్తుండే వారు ప్రజలతో ఉండాలని కరీంనగర్ లో 1989-94 వరకు ఎమ్మెల్యే .. ఇండిపెండెంట్ గా గెలిచిన జగపతి రావు కు వ్యతిరేకంగా బొమ్మ వెంకన్న మేమంతా కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు . ఇక్కడ కాంగ్రెస్ సీపీఐపార్టీ లకు అనేక ఘర్షణలు ఉండేవని గుర్తు చేశారు చాడ వెంకటరెడ్డి,బొమ్మ వెంకన్న కలిసి సామరస్య వాతావరణం ఏర్పాటు చేశారు నియోజకవర్గ అంశాలకు చాడ వెంకటరెడ్డి సలహాలు సూచనలు చేస్తుంటారు మాజీ ఎమ్మెల్యేలు సతిష్ బాబు ,ప్రవీణ్ రెడ్డి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ను కూడా నియోజకవర్గ అభివృద్ది కి సలహాలు సూచనలు అడుగుతున్నామన్నారు రాజకీయాలు వేరు అభివృద్ది వేరు కెసిఆర్ గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్ద కుర్చీ వేసుకుని కడతా అన్నారు ఏమైందని గుర్తు చేశారు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచ వరదకాలువ ద్వారా నిల్లెత్తి పోస్తామన్నారు గౌరవెల్లి గండి పల్లి ప్రాజెక్టు. ఎప్పుడో పూర్తి కావాల్సిందికాని నేను ఎన్నిక కాగానే 430 కోట్లు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలకు కేటాయించుకున్నామన్నారు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కి నిధులు కేటాయించలేదు.. త్వరలోనే కాలువకు పూర్తి చేసి ఈప్రాంత రైతాంగానికి నీళ్లు అందిస్తామని చెప్పారు చౌటపల్లి ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం.. మీ అందరి ఆమోదంతో మాత్రమే అక్కడికి పోతాం.. మీకు ఒక పైసా అన్యాయం చేయమన్నారు అక్కడ పారిశ్రామిక కారిడార్ సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలుతెలియజేశారు విద్యా వైద్యం ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు వైద్యం కోసం మరో 150 పడకల ఆసుపత్రికి అదనంగా అందుబాటులోకి తెచ్చామన్నారు గతంలో ఇచ్చిన నాయకుల స్పూర్తి తో ముందుకు పోతున్నమన్నారు బొమ్మ వెంకన్న చూపే ప్రేమ అభిమానం చిరస్థాయిగా ఉంటుందన్నారు బొమ్మ వెంకన్న ప్రేమా ఆప్యాయతలు ఉంటాయన్నారు హుస్నాబాద్ ను ఆదర్శ నియోజకవర్గంగా అన్ని రకాలుగా అభివృద్ది చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నమన్నారు స్టేడియం ,ఎల్లమ్మ చెరువు ,బస్ స్టాండ్ ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తున్నామన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular