పరీక్షలు ప్రశాంతంగా రాయాలి
పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
తొలి రోజు రెగ్యులర్ విద్యార్థుల హాజరు 99.84, సప్లమెంటరీ విద్యార్థుల హాజరు 91.89 శాతం
పరీక్షల తీరును పరిశీలిస్తున్న కలెక్టర్
జగిత్యాల
ప్రశాంతంగా పది పరీక్షలు రాయాలని
విద్యార్థులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. సోమవారం నుండి
ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు మొదటి రోజు
జగిత్యాల జిల్లాలో
రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.84,మరియు సప్లమెంటరీ విద్యార్థులకు హాజరు శాతం 91.89
మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు..
జగిత్యాల కేంద్రంలోని గోవింద్ పల్లి వద్ద గల గౌతమి హైస్కూల్, ఆక్స్ఫర్డ్ హై స్కూల్, పాత బస్టాండ్ వద్ద గల ప్రభుత్వ హైస్కూల్( ఓల్డ్)లలో ఏర్పాటు
చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
పదో తరగతి మొదటి రోజు తెలుగు పేపర్ -1(64) రెగ్యులర్ పరీక్ష కేంద్రాల్లో మొత్తం11,394 విద్యార్థులకు గాను 11,376 విద్యార్థులు హాజరయ్యారు. 18 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.84% ,సప్లమెంటరీ విద్యార్థులకు(03) పరీక్ష కేంద్రాలలో 37 విద్యార్థులకు గాను 34 మంది విద్యార్థులు హాజరైనారు.. వీరి హాజరు శాతం 91.89%
పదవ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు సజావుగా, మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించారని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.ఏలాంటి
మాల్ ప్రాక్టీస్ కేసులు
నమోదు కాలేదని, ప్రశాంతంగా పరీక్ష జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ (02) పరీక్ష కేంద్రాలను, రాష్ట్ర పరిశీలకలు (05) పరీక్ష కేంద్రాలను, జిల్లా విద్యాధికారి (06) పరీక్ష కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్(21) పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు..