యాంటీ డ్రగ్స్‌ కమిటీల ఏర్పాటుకు కసరత్తు

- Advertisement -

యాంటీ డ్రగ్స్‌ కమిటీల ఏర్పాటుకు కసరత్తు
– ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

Exercise for formation of Anti-Drugs Committees

పెద్దపల్లి
జిల్లాలో మాదక ద్రవ్యాలను నియంత్రణకు విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్‌ కమిటీ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబం ధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికా రులతో నిర్వహించిన సమావే శంలో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కస్తూర్బాగాంధీ విద్యాల యాలు, మోడల్‌ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు
డ్రగ్స్‌, ఇతర మాదకద్రవ్యాలు అలవాటు ఉన్న వారిని గుర్తించి వారిని పునరావాస కేంద్రాల ద్వారా అలవాటు మానిపించాలని అన్నారు. విద్యా సంస్థల్లో నిర్వహించే పేరెంట్‌ టీచర్స్‌ సమావేశాల్లోనూ డ్రగ్స్‌, గంజాయి విని యోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిం చాలన్నారు. చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందజేయాలని కలెక్టర్‌ సూచించారు. మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకో వాలని అన్నారు. జిల్లాలో గంజాయితో పాటు గుడుంబా నివారణకు సైతం అవసరమైన చర్యలు కచ్చితంగా చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్‌ అందించేందుకు గోదావరిఖని ఆసుప త్రిలో 10 పడకల డీ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు.

అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్‌ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్‌ షాపులలో స్టాక్‌ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్ట్టర్‌కు సూచిం చారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియ జేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి క్రిష్ణ, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్‌, డీఎఫ్‌ఓ శివయ్య, ఎక్సైజ్‌ శాఖ ఈఎస్‌ మహిపా ల్‌రెడ్డి, డీఈవో డి మాధవి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ఖాన్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధి కారి కల్పన, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రకాష్‌, అధి కారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular