ఇందిరమ్మ రాజ్యంలో దోపిడీ రాజ్యమేలు తుంది

- Advertisement -

ఇందిరమ్మ రాజ్యంలో దోపిడీ రాజ్యమేలు తుంది

Extortion reigns supreme in Indiramma's kingdom

    మండిపడ్డ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
హైదరాబాద్‌ నవంబర్ 7
ఇందిరమ్మ రాజ్యంలో దోపిడీ రాజ్యమేలుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  మండిపడ్డారు. రైతుల రెక్కలకష్టం దర్జాగా దళారుల పాలవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఆఫీసులో కనుగోలు కేంద్రం తప్ప రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం పనిచేస్తలేదని విమర్శించారు. ఏ రైతుకు ముఖ్యమంత్రి మద్దతు లేదని, అందుకే వరికి, పత్తికి, దేనికీ మద్దతు ధర లేదని ఎక్స్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు.సన్నాలకే బోనస్ అన్న సన్నాసుల మాట మార్కెట్ యార్డుల సాక్షిగా నీటిమూటే అయ్యిందని విమర్శించారు. మొన్న రైతుకు రుణమాఫీ చెయ్యలే, నిన్న రైతుకు పెట్టుబడి సాయం ఇయ్యలేదని చెప్పారు. నేడు రైతు పండించిన పంటను కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక.. ఈ ఇందిరమ్మ రాజ్యం ఉండెందుకు.. ఆరుగాలం కష్టించే అన్నదాతను అరిగోస పెట్టేటందుకా అని ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular