లక్కేపూర్ లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

- Advertisement -

లక్కేపూర్ లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Extraordinary response to free medical camp in Lakkepur

మంథని
మంథని మండలం లక్కేపూర్,తోట గోపయ్యపల్లి గ్రామంలో స్వర్గీయ తోట కొమురయ్య జ్ఞాపకార్థం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ  శిబిరాన్ని స్వర్గీయ తోట కోమురయ్య సతీమణి తోట లక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మంథని పటేల్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో కరీంనగర్ సన్ రైజ్ ఆసుపత్రి వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు చేసి, మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు 200 మంది ప్రజలు హాజరై ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణి, క్యాబ్ మేనేజర్ రాజేందర్, కోఆర్డినేటర్ సతీష్, మార్కెటింగ్ తిరుపతి, పటేల్ ఐ కేర్ వ్యవస్థాపకుడు బుద్ధర్తి సతీష్ కుమార్,స్వర్గీయ తోట కోమురయ్య కుటుంబ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular